అందమైన ప్రేమ

అందమైన  ప్రేమ

ఒక కవిత రాసి చూసుకున్నప్పుడు
నా దృష్టి చేతి వేళ్ళపై పడింది

నా జీవితాన్ని నిర్ణయించింది
నా వేళ్ళు అని గ్రహించాను

చదువుకుంటున్న రోజుల్లో
నా చేతిరాతను చూసిన మిత్రులు
“నీ చేతిరాత అందంగా కుదురుగా ఉంది” అని చెప్పినప్పుడు
ఆరంభమైంది అందంతో నా బంధం….

అందాన్ని చూడటం ఆస్వాదించడం
మొదలుపెట్టాయి కళ్ళు
ముందుగా కళ్లతోనూ
ఆ తర్వాత మనసుతోను కొనసాగింది
అందానికైన బంధం

నిరుడు నాకోసం
ఓ అందం నిరీక్షించింది
దాని పేరు “అందమైన ప్రేమ”

అప్పటి వరకు నేనే అందాన్ని చూస్తూ వచ్చాను
మొదటిసారిగా ఆరోజు “అందమైన ప్రేమ” నన్ను చూసింది.

అందులోనూ “అందమైన ప్రేమ” నన్ను ఆకట్టుకుంది….

నా మొదటి కవితను నా పెదవులు ఉచ్చరించాయి
అది నీ పేరు

నా మొదటి కవితను నా మనసు ఉచ్చరించింది
అది నీ పేరు

నా మొదటి కవితను నా వేళ్ళు రాసాయి
అది నీ పేరు

నిన్ను స్పర్శించడం ఓ గొప్ప కానుక
అదొక వరం

ఎప్పుడో నేను చేసుకున్న పుణ్యం…
అది అక్షర మహిమ….

ఆ వరప్రసాదమే నా వేళ్ళు రాసే కవితలు…
—————————-
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.