అడిలైడ్ లో అట్టహాసంగా దీపావళి

36 DSC_0125 DSC_0115

సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం గత నెల దసరా దీపావళి ఉత్సవాలు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు శ్రీ ఆర్ పి పట్నాయిక్ ముఖ్య అతిధిగా ఇతర గాయక, గాయనీ మణులు సత్య యామిని, మనీష మరియు అనుదీప్ గార్లతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ దీపావళి అడిలైడ్ తెలుగు సంఘానికి ప్రత్యేకమైనదని షుమారు 300 వందలకు పైగా తాసా సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినట్లు అధ్యక్షులు శ్రీ సత్య శీలం గారు చెప్పారు.

ఇక్కడి తెలుగు సంఘానికి అనితరమైన సేవలందిస్తున్నవారికీ గుర్తించడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం తెలుగుబడి మరియు తెలుగు రేడియో కార్యక్రమాలను ప్రత్యేకించి ప్రారంభించి జయప్రదం కావడానికి కారకులైన మన తెలుగు ఆడపడుచులు శ్రీమతి వరూధిని దైత (ప్రిన్సిపాల్ తెలుగుబడి), శ్రీమతి వాణిశ్రీ వాకచర్ల (వైస్ ప్రిన్సిపాల్ తెలుగుబడి) మరియు శ్రీమతి కళ్యాణి చింత (తెలుగు రేడియో వాచస్పతి) గార్లను సంగీత దర్శకుడు శ్రీ ఆర్ పి పట్నాయిక్ గారు సన్మానించారు.

గాయక, గాయనీ మణులు తమ మధుర గానామృతంతో ఆహూతులందరినీ ఓలలాడించి నృత్యం చేయించారు. ఎంతో ఆనందంగా గడిపిన ఈ మధుర క్షణాలు జీవితంలో మరువలేవని చాలామంది ప్రేక్షకులు కార్య నిర్వాహక వర్గాన్ని కొనియాడి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

71DSC_0182

Send a Comment

Your email address will not be published.