అత్తలకు హితవు

కొడుకుల కన్నానని
కులికేవుకాని కాంతరో ,
అడ్డాలనాడు బిడ్డలు కాని ,
కోడండ్ర నాడు కాదని ,
అత్తా ఒకనాటి కొదలలేనని ,
ఇంగితమెరిగి ఇంపుగా మసలుకో ,॥ కొడుకుల ॥

కన్నవారిని వీడి కోటి
కోటి కోర్కెలు మేటి మధురోహలతో ,
చెకొన్నవారిల్లు,
చేరిన కోమలి నారళ్ళ పాలు జేయక
అలనాటి నీ అనుభవాల తరచి జూచి ,
అమ్మవై ఆదరించు ,॥ కొడుకుల ॥

కొంగు చాటు కొడుకు
కోడలి పరమయ్యెనని ,
కలత జెందక దీవించు మనసార ,
అంతరంగికాలు ఆరా తీయక ,
అనాయాచిత సలహాల,
అసమ్మత బోధనల ఊదరగొట్టక ,
ఊరకుండు .॥ కొడుకుల ॥

మర్యాద ,మన్ననలంటూ ,
కారాలు మిరియాలు నూరక ,
మమతలు పంచి సమతను పెంచు ,
కొడుకుల కాపురాల కార్చిచ్చు
రేపు కొరివిగాక
కళ కళ జీవిత విలువల హితవేదో ,
దెలిపి ఆదర్శ మాతృమూర్తి,
ఆదర్శ అత్తవై ఆత్మీయతా
ఆనందము ॥ కొడుకుల ॥

ఆధునిక తత్వాన అపరిపక్వతాభావాన
అదిలించి విదిలించినా
సాధించి వేదించినా
అత్తగా అహంకరింపక అమ్మవై సైచి
అనురాగము పంచి ఆదరమందు॥ కొడుకుల ॥