అద్దము విరిగితే అతకవచ్చు,
మనసు విరిగితే అతకలేము –పెద్దల నానుడి
————————————————————
అద్దము విరిగితే అతకవచ్చు
అదే మనసు విరిగితే అతక లేము,
ఏ జిగురుతోనయిన ఏ మాటలు,
ఏ పనులతోనయిన అతికించ నేరము,
విరిగిన బీటల ఆనవాళ్ళు మాసి పోక మిగిలి
మది గోడల మారు మూలల మారు దాగి
అడును జూచి దాడిచేయు,
అదే మనసు విరిగితే అతికించ నేరము,
ఏ రీతి గాను ,,
అను అనాది నానుడి నిక్కమని తోచు.॥ అద్దము ॥
సూటి పోటి అపవాదులు
అసత్య సంభాషణలు
అపహాస్యములు
పరుష సంభాషణలు,
క్రోదావేసాల పర్యవసానాలు,
మాటలు,తుపాకి తూటాలై
పరుష వాక్యాలు సూలపు పోటులై ,
హృదయాన్తరాళ ముల తాకి
గాయపరచు,మనసును విరిచి మానని
గాయము మిగుల్చు ॥ అద్దము ॥
బీటలు వారిన మది ,
హృది మునుపటి స్థాయిని చేరలేదు,
అనురాగ వాత్సల్య ప్రేమాను భూతులు ,
స్నేహ బాంధవ్యాలు ఒకేరీతి ని ఎంతగా పంచినా,,
జారిన నోరు జారి పలుకులు,
చేయి జారిన చేతలు,
మాయని మరకలు ,
మదిమూలల పొంచి ,
అపుడపుడు విరోధముల రేపు ॥అద్దము ॥
ఆత్మీయులు ,తలి దండ్రులు,తోబుట్టువులైన
అరమరికలు అపోహలు పొరపొచ్చాలు,
తగవులు తగాదాలు కలిగినా ,
కాలాను క్రమాన సమసిపోవు,
తిరిగి మమకారాలు
మమతలు పెల్లుబుకు ,,
దాంపత్య జీవితాన దంపతుల నడుమ ,
చిరు చిరు వాగ్వివాదాలే అపోహలే
చివికి చివికి గాలివాన అన్నరీతి,
సుఖమయ జీవితాల చెదరగొట్టి
అరుదైన క్షణాల తిరిగి మాటకు మాటై ,
భగ్గుమని దాంపత్య సుమాల కాలరాయు,
అతి సున్నిత సుకుమార ,అనురాగ బంధం ,
వైవాహిక బంధం, ఆచి తూచి
మృదు మధుర భాషణల,
సరస ,సరాగాల,
అధరాల చిరు నవ్వుల ,ఆనంద డోలల తెలవలే ,
ఆగ్ర హావేశాల నదుపు జేసి,సతి పతు లిరువ్రురు
ఒకరు క్రొధావెశాల విజ్రుమ్భించ ,వేరొకరు ,
మౌనముద్ర తో నుండి
శాంతియుత సంబాషణల, సామరస్య వైనాన
సమస్యా పరిష్కారము జేసి
ఆనంద సౌఖ్యాల తేలవలె
–కామేశ్వరి సాంబమూర్తి.భమిడిపాటి
the scrolling bar is broken, so we cannot scroll down to the end of the poem. please fix it. thank you.