అమెజాన్‌ ప్రైమ్ లో 'నిశ్శబ్దం

అమెజాన్‌ ప్రైమ్ లో 'నిశ్శబ్దం

అమెజాన్‌ ప్రైమ్ లో రానున్న నిశ్శబ్దం

దక్షిణాది నటి అనుష్క శెట్టి ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాల తరువాత పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా నటించింది. కరోనా వైరస్ లేకుంటే ఈ పాటికే చిత్రం థియేటర్లో విడుదల కావాల్సింది. కానీ పరిస్థితి చూస్తుంటే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చిత్రాన్ని డిటిటల్‌ వేదికగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్‌ హక్కుల్ని అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ తీసుకుందని సమాచారం. అంతేకాదు చిత్రాన్ని అక్టోబర్ 2 విడుదల చేయాలని భావిస్తోందట. చిత్రంలో మాధవన్, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తుండగా షనైల్‌ డియో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

Send a Comment

Your email address will not be published.