అమ్ముంటే చాలు!

దేవుడు నిరాకారుడు!
నిర్గుణుడు!
అయితే ఏం?!
అమ్మ ఎదరే వుందిగా!

కాశ్మీర్ హల్వా!
బెంగాల్ రసగుల్లా!
ఏదైతే ఏం?!
అమ్మ ప్రేమ మధురం!

డబ్బు దస్కం!
వజ్రం వైడూర్యం!
ఎన్నైతే ఏం?!
అమ్మ ప్రేమ అమూల్యం!

నింగి, నేల!
నీరు,నిప్పు!
ఎన్నైతే ఏం?!
అమ్మ మమత అనంతం!

పేరు,హోదా!
ధనము,గుణము!
మనకుంటే ఏం?!
అమ్మని చూడాలి కలకాలం!

మీ…✍🏻విక్టరీ శంకర్