అలనాటి నేతలు!!!

త్యాగ పూరిత నాడు
స్వార్ధపరత్వ నేతలు నేడు
అలనాటి నే తలు అవిరామ దీక్షను బూని
అవిరళ కృషిని అతివాదులు మిత వాదులుగా
ఎన్నో ఎన్నెన్నో త్యాగములోనర్చి,
స్వసుఖముల,స్వజనుల వీడి
భరత మాత స్వేచ్చకై పోరు సలిపి
ప్రా ణ త్యాగాములకైన వేనుదీయరాయే ||అలనాటి నేతలు
నిర్భీతిగా పోరుసలిపి బ్రిటిషు సైనికుల
లాఠీ దెబ్బలు బూటు తాపులు
ఇంకెన్నో హింసలు సైచి వెనుదిరగక
వీరపతాకమేగురవేసిరి,||నాడు||
యువకిసో రం భగత్‌సింగ్ అతివాదిగా
హింసకు హింసగా” డయ్యర్ జలియన్‌వాలా బాగ్”
మారణకాండ ప్రతీకార చర్యలో ఖైదీ ఐ
ఉరికంబమేక్కే,
“సుభాష్ చంద్ర బోస్ “విమాన దుర్ఘటన పాలై
స్వాతంత్ర్య పోరున ,అసువులు బాసి
కనుల కానరాని వీరమరణ మంది ,
ఈనాటికీ ప్రజాహృదయాల సజీవుడైనిలచే ,||అలనాటి నేతలు,||
“స్వాతంత్ర్యము నాజన్మహక్కని”ఎలుగెత్తి చాటిన
బాలగంగాధర తిలక్ ,
గుండు కెదురుగా గుండె నిలిపి
“సైమందొర గోబాక్ “అని ఘోషించిన
ఆంద్ర కేసరి “టంగుటూరి “||అలనాటి నేతలు||
ఆనాటి మనప్రధాని నిస్వార్ధ నిరాడంబరజీవి లాల్బహదూర్సాస్త్రి
అనతికాల పాలనలోనే దేశప్రగతి పగ్గాల్లు పట్టి ,
జై జవాన్ ,జైకిసాన్ అను నినాదాన వీర
జవానుల,కర్షక జనాల నుత్తేజపరచి
హరితవిప్లవముప్రోదిచేసి ,ఇండో -పాకిస్తాన్ సమరాన
విజయపతాకమేగురవేసి తాష్కంట్ సమావేశ సమయాన
సంధి చర్చలు వేళ అనారోగ్యము పాలై
అసువులు బాసే . ||,నేతలు నాడు||
వనసంపదలపై ఆంక్షలు విధించి అడవిబిడ్డల
పురుషుల హతమార్చి స్త్రీల హింసించు ,
బ్రిటిషు సైనికుల దురాగతముల నణ చి దునుమాడి
అడవులన్నీ తిరిగి అడవుల నుండి పోరి
కొండ దొరల క్రోడీకరించి
బడబానలమంటి బ్రిటిషు సేనలప్రక్కలో బల్లెమై
గడ గడ లా డించి
తెల్లదొరల మాయాజాల నిర్బంధాన
తూటాలకు బలి అయిన వీరబెబ్బులి ,
ఆధునిక వీరాభి మన్యు అల్లూరి సీతారామరాజు ||అలనాటి నేతలు ||
వీరపోరాటాన “ఉక్కుమనిషి”గ
కీర్తి వడసిన ” సర్దార్ వల్లభాయి పటేల్ “
స్వాతంత్రసమర వేళ స్వగృహం'”ఆనంద భవ నమునే ‘”
“దారాదత్తం చేసిన
నిఘూడ త్యాగమూర్తి” మోతిలాల్ నెహ్రు “
అనున్గుబిడ్డ భారతావని
వినువీధుల శాంతి కపోతమేగురవేసిన
“శాంతి దూత చా చా నెహ్రు “||అలనాటి నేతలు||
అహింసా సూత్రాన అందరిని ఒకటి గ
సమీకరించి” రఘుపతి రాఘవ రాజా రాం
సభుకో సంమ్మతి దే భగవాన్ “
అని సత్యాగ్రహ సామరస్య శాంతి సాధనల
స్వాతంత్ర్యం సాధించి
గాడ్సే తూటాలకు నేలకొరిగిన
మహామేరువు మనజాతిపిత
“మోహన్ లాల్ కరంచంద్ గాంధి “
భారాతవనిని స్వేచ్చావాయువుల ప్రసరింపజేసి
భారతమాత కన్నీరు తుడిచి వీరమాతగా నిల్పిన
మహాత్యాగాధనులు మరలి పోవగా ,
నేడు
ఈనాటి నేతలు కొందరు అమాయక జనుల
ఆశలకు బాసల ఎరలు వేసి అందలాలెక్కి
వాగ్దానాల పలుపు తాడుతో ప్రజల ను
ఆలమందలుగాజేసి అందినంత స్వాహాచేసి ప్రపంచరుణాల ,
పెంపుజేసి ప్రగతిని ముంచు చుండే,
ప్రతిరాష్ట్రమున కొక విప్లవవిద్రోహ ముతా లు లు ప్రబలి
ధన దాహాన ప్రజా మారణ హోమాలు సేయ ,
దురాగతాలదుష్ట దమనకాండల
రూపు మాపి శాంతిభద్రతల కాచి ,
అమాయకప్రజల ఆదుకొన అసమర్దులై
ఎవరికీ వారే అందినంత స్వాహాజేసి
ఆనందించు ,నేతల ,గని బ్రిటిషు దాస్య శృంఖలములు వీడి
స్వేచ్చావాయువుల పీల్చు భరతమాత,
స్వంత బిడ్డల
అక్రమ సమస్యా శృం ఖలముల
బందీగా ఆక్రో సించి కృంగి క్రుసించే నేడు