అలా ఇలా ...

ఉండొచ్చు
వేర్వేరు శబ్దాలు
నీ మౌనం కూడా
అలా మారుతూనే ఉంది
రకరకాలుగా …ఎలాగంటావు?

బయలుదేరినప్పుడే తెలిసింది
రైల్లో నువ్వు
పట్టాలపై నేను
నువ్వు ప్రేమిస్తున్నావా ?
అడగటానికి నాకు జంకే
మీరు ప్రేమిస్తున్నారా ?
అడగటానికి నీకూ జంకే
అందుకే ఇలా అడగాలనుకున్నాను
మనం నిజంగానే
పరస్పరం ప్రేమించుకుంటున్నామా ?

నా నీడా
ఆలోచిస్తోంది నిన్ను
కానీ
నీ నిజం ఎందుకు
దాస్తోంది నన్ను?
నేను నిరీక్షిస్తున్నాను
తీరంలా
నువ్వు
వచ్చి వెళ్లిపోతూ ఉంటావు అలలలా
ఆకాశం స్పష్టంగా ఉంది
చందమామలా మంచులా
ఒకే రంగులో ఉన్నాది…..