వాల్ట్ డిస్నీ చిత్ర నిర్మాతలు ఎంతగా వినోదాత్మకమైన చిత్రాలు తీసినా, హాస్య ప్రియులైనా వాళ్ళకూ కోపం వస్తుంది రోషం కూడా లేకపోలేదు అని చెప్పుకున్నారు ఒకానొకప్పుడు.
స్నో వైట్ అనే ఒక కార్టూన్ చిత్రాన్ని వాళ్ళు నిర్మించడం తెలిసిందేగా. స్నో వెయిట్ అమ్మాయికి వాళ్ళు అందమైన రూపం ఇచ్చి ప్రేక్షకుల ముందు ఉంచారు. ఆ స్నో వైట్ ని ప్రెంచ్ ఎయిడ్స్ అసోసియేషన్ తమ ప్రచారానికి ఉపయోగించడం సబబేనా? అని డిస్నీ సంస్థకు కోపం పొంగుకొచ్చింది.
ఒక మగాడు బోర్లా పడుకోగా ఓ సుందరి తన ప్రియుడి వీపు మీద కూర్చుని ఉన్నట్టు ఒక పోస్టర్ విడుదల చేసి దాని కింద “మీ ప్రేమ ఒక దేవత కథలా ఉండనీ…ఇలా ఉండకూడదు” అని ప్రెంచ్ ఎయిడ్స్ అసోసియేషన్ ఓ కాప్షన్ రాసింది. దానితో డిస్నీ సంస్థ వారిపై దావా వేసింది.