ఆత్మ-ప్రయాణము

నిర్భయ నిశ్చల విజ్ఞానవీధి! నిర్మలానందానుభవ ప్రవాహపు వీధి!
అజ్ఞానచీకటులు తొలగిపోయే వీధి! సంకుచిత భావాలు ధగ్ధమౌ వీధి!
వేదశబ్దములు వినిపించు వీధి! సత్యనిష్టాగరిష్టుల దర్శనమౌ వీధి!
సత్యాన్వేషణ సఫలమౌ వీధి! నిత్యానిత్య వివేకము నిత్యవ్రతమౌ వీధి!
అశాంతి సర్వమూ మాయమౌ వీధి! ప్రశాంతి నిత్యమై వెలిగిపోయే వీధి!
కర్మబంధములను తొలగించే వీధి! నిష్కామ కర్మలను చేయించే వీధి!
ఆత్మస్వాతంత్రమే నిక్కమైన వీధి! ఆత్మసాఫల్యమే జీవితవిధాన వీధి!