‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌లో అజయ్‌ దేవగన్‌

‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌లో అజయ్‌ దేవగన్‌

‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌లో స్వాతంత్ర్య సమరయోధుడిగా అజయ్‌ దేవగన్‌

RRRప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం (ఆర్‌.ఆర్‌.ఆర్‌) ‘రౌద్రం రణం రుధిరం’. ఇందులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు ప్రధాన కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్‌కి చెందిన అజయ్‌ దేవగన్‌ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు. అది స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నారు. ఇందులో ఆయన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకి గురువుగా నటించనున్నారని సమాచారం. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్‌ 75 శాతం వరకు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. చిత్రం కోసం రామోజీ ఫిలింసిటీలో 19‍00ల నాటి కాలానికి అనుగుణంగా సెట్‌ని వేశారు. అక్కడ 10 రోజులపాటు అజయ్‌పై చిత్రీకరించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో అలియా భట్‌ రామ్‌చరణ్‌ సరసన సీతగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లకి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడదుల చేశారు. అందుకు అనుగుణంగా కొన్ని సినిమాలు షూటింగ్‌ని కూడా ప్రారంభించాయి. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ షూటింగ్‌ మాత్రం మొదలుకాలేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెల్లో విడుదల కానుంది. ఇక అజయ్‌ దేవగణ్‌ ప్రస్తుతం తను హీరోగా ‘భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్’‌ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు ఆయనే స్టంట్‌ మాస్టర్‌గా వ్యవహరించాడు.

Send a Comment

Your email address will not be published.