ఆశ

ప్రతిరోజు నాచూపు ద్వారం వైపు
అస్తమించని ఆశ నాది
ఉదయించని వయస్సులో…
ఎందుకువస్తారు..ఇప్పుడునేను
అద్దానికి ఇవతలి వైపు
ప్రపంచానికు దూరంగా
వాడుతున్న వయస్సులో
కొంచం చూపు కొంచం మరుపు
నాలుగు గోడల ప్రపంచంలో
రాత్రి పగలు తేడా తెలియక
ఆగిన పయనంలో సాగేనడకతో
పనికిరాని వస్తువులా
పడెయ్యలేని స్థితిలో
నవీన నాగరికతలో
చట్టపుటక్కుల చుట్టాన్నై
ఆశ చావక గుండె తడువక
పలకరింపుకు ఎదురుచూపు
ఎక్కడో ఆశ…
ఎగిరిపోయిన గువ్వలన్ని
ఈగుండెవైపు చూస్తాయని
నా గూటివైపు నడుస్తాయని….
–డా. ప్రభాకర్ బచు