అవును కంగారు పడకు చదువు శాంతంగా….ఒక ప్రేయసి నీ ఇంట మరొక ప్రేయసి నా హృదయంలోనిన్ను కనులు తెరచి చూస్తున్నాను ఆమెను కనులు మూసి చూస్తున్నానునిన్ను తొలిసారిగా నేను చూసినప్పుడే ఆమె నా హృదిలో అవతరించిందినువ్వు నవ్వుతున్నట్టే ఉంటుంది ఆమె నవ్వుతున్నప్పుడు కూడా కానీ నువ్వు కోపంగా చూస్తున్నట్టు ఆమె కోపంగా చూడదు నువ్వు చిన్నారిగా పుట్టి ఆమె దేవకన్యగానే పుట్టింది నువ్వు మాతో మాట్లాడక మౌనం
|
ఆమె మౌనంగానే నాతో మాట్లాడుతోంది నాతో రాయిస్తోందిఆమె కళ్ళను చూసే మేర్చుకున్నాను నీ కళ్ళను రెప్పవాల్చకుండా చూడటంఆమెను తోడు చేసుకునే నిన్ను చూడటానికి వచ్చానునిన్ను చూసి ఆమెతో ఇంటికి వెళ్ళిపోయానుఇంతకీ నా హృదయంలో ఉన్న ఆ రెండో ప్రేయసి ఎవరనుకున్నావు? కోప్పడకు చెప్తున్నాను ఆ ప్రేయసి ఎవరో కాదు నిన్ను చూసిన మరుక్షణమే నా యెదలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నువ్వే నానీ … నువ్వే …అచ్చంగా నీ ప్రతిరూపమే ఆ రూపానికి రోజూ ముద్దు ఇస్తున్నాను నీ పెదవుల తడికి కారణం అదే … – యామీ |
ఇద్దరు ప్రేయసిలు
