ఈ చరిత్రను మార్చగలరా ఎవరన్నా?

ఈ చరిత్రను మార్చగలరా ఎవరన్నా?

ఇక్కడున్నా.. అక్కడున్నా ..ఎక్కడున్నా
తెలుగునేల మనది .. తెలుగు బ్రతుకులు మనవి

శతాబ్దాలుగా వెలుగుతున్న తెలుగు జ్యోతి మనది
తెలంగాణ మనది.. సర్కారు మనది..రాయలసీమ మనది
నాటి మూడు నాడులు కలిసిన నేటి తెలుగు నేల మనది

మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో
భాగవతం జనించింది ఏకశిలానగరంలో
అష్ఠదిగ్గజాల భువనవిజయం రాయలసీమలో

ప్రాంతాలు వేరైనా మన జాతి సంస్కృతి ఒక్కటే
దూరాలు వేరైనా మన భాష తెలుగు ఒక్కటే

ఇక్కడున్నా.. అక్కడున్నా ..ఎక్కడున్నా
తెలుగునేల మనది .. తెలుగు బ్రతుకులు మనవి

Send a Comment

Your email address will not be published.