ఉన్నది ఒక్కటే జిందగీ

ఉన్నది ఒక్కటే జిందగీ

పీఆర్ సినిమాస్, స్రవంతి సినిమాటిక్స్ కలిపి నిర్మించిన చిత్రం ఉన్నది ఒక్కడే జిందగీ. ఈ చిత్ర నిర్మాత కృష్ణ చైతన్య.

కిషోర్ దర్శకత్వంలో రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీ విష్ణు, ప్రియదర్శి తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.

కథలోకి వెళ్దాం…..
అభి పాత్రలో నటించిన రామ్ కు స్నేహం అంటే ప్రాణం. అతను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వాసు అనే మిత్రుడు ఉండేవాడు. అతనంటే రామ్ కి ఎంతో ఇష్టం. వాసు పాత్రలో శ్రీ విష్ణు నటించాడు. వాసుని ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకునే వాడు కాదు రామ్. కాలంతోపాటే వారి మధ్య స్నేహం కూడా అంతెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. వాసులాగే రామ్ కి కూడా సంగీతమంటే ఇష్టం. సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు. వారి జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంటుంది. వారి మధ్య అనుకోని రీతిలో ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆమె పేరు మహా. మహా పాత్రలో అనుపమ నటింటింది. మహాకు కూడా సంగీతమంటే ఇష్టం. దాంతో వారి మధ్య పరిచయం పెరుగుతుంది. సన్నిహితులవుతారు. అయితే వాసుకి కూడా మహా అంటే ఇష్టమేర్పడుతుంది. ఈ విషయం రామ్ కి తెలుస్తుంది. తమ మధ్య ఈగో ఉండకూడదనే కారణంగా ఇద్దరూ ఏకకాలంలో మహాకు తమ మనసులోని మాటను చెప్పి పెళ్ళికి ప్రపోజ్ చేస్తారు. మహా ఏ మాతరం ఆలోచించకుండా వాసు అంటే ఇష్టమని చెబుతుంది. వాసు కూడా రామ్ ని కాదని మహాకే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దాంతో రామ్ కి కోపం వచ్చి వాసుకి దూరమవుతాడు. వాసు అంటే ఎంతో ఇష్టమనుకున్న రామ్ ఎందుకు దూరమయ్యాడు, వారిద్దరూ తిరిగి కలుసుకున్నారా…వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

ఈ చిత్రంలో రామ్ ఏ దశలోనూ పాత్రకు తగినట్టే నటించి అన్ని విధాల న్యాయం చేశాడు. అలాగే అతని ప్రాణమిత్రుడి పాత్రలో శ్రీవిష్ణు కూడా ఎంతో బాగా నటించాడు.

ఇక అనుపమ పరమేశ్వర్ విషయానికి వస్తే ఆమె అద్భుతమైన నటనా ప్రతిభ కనబరచి అందరినీ ఆకట్టుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఆమె పాత్ర కూడా చాలా బాగుంది. దాన్ని మలచిన తీరులో దర్శకుడి ప్రతిభ చూడొచ్చు. లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే ఆహా ఓహో అని చెప్పడానికి వీల్లేదు. పరవాలేదు.

దర్శకుడు కిషోర్ కథ కొంచెం బలహీనంగా అనిపించినా ప్రాణమిత్రులు, కథానాయిక పాత్రలు మలచిన తీరు సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.

స్నేహ సంబంధం నేపథ్యంలో సాగిన కథలో మాటల కూర్పు హాయిగా ఉంది.

స్రవంతి రవికిశోర్ నిర్మాణ సారధ్యంలో నిర్మితమైన ఈ చిత్ర విలువలు ఏ మాత్రం తగ్గలేదు.

కథలో ఇంకాస్త పట్టు ఉంటే మరీ మరీ బాగుందని చెప్పుకునేలా ఉండేదీ చిత్రం. ఏదేమైనా ఈ చిత్రాన్ని ఓ సారి చూసి తరించొచ్చు.

Send a Comment

Your email address will not be published.