ఎన్టీఆర్‌ తో జాన్వీ

ఎన్టీఆర్‌ తో నటిస్తున్న జాన్వీ

దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ దక్షిణాదిలో అవకాశం వస్తే నటిస్తానని గతంలో ఓసారి చెప్పింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తన 30 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. తాజాగా ఓ కథానాయిక పాత్ర కోసం జాన్వీ కపూర్‌ని ఎంపిక చేశారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే గతంలోనే సమంత, పూజాహెగ్డే, రష్మిక మందన్న లాంటి కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పటికే వరకు ఏ కథానాయిక పేరు కూడా అధికారికంగా వినిపించడం లేదు. మొత్తం మీద ఈ నలుగురిలో ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. జాన్వీ కపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి ‘దోస్తానా 2’ చిత్రంలో నటిస్తోంది. తివిక్రమ్‌ సినిమాలు పేర్లు కొంచెం పెద్దవిగానే ఉంటాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ కలిసి తీసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం పేరును పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది. త్రివిక్రమ్‌ గతంలో వేరే కథానాయకులతో తీసిన చిత్రాల పేర్లును కూడా మనం చూడవచ్చు. వాటిలో ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురములో’, ‘ఛల్‌ మోహన్‌ రంగ’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ లాంటివి చూడొచ్చు.

Send a Comment

Your email address will not be published.