ఎర్ర బస్సు సిద్ధం

ఎర్ర బస్సు సిద్ధం

ఎర్ర బస్సు ప్రేక్షకుల  దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ, ఇతర పనులు పూర్తి అయ్యాయి. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో ప్రధాన కథ తాతా మనవడు మధ్య సాగే బంధం….అనుబంధం …

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ తమిళంలో వచ్చిన మంజప్పై సినిమా చూసిన తర్వాత ఆ కథ అచ్చంగా మనకు సరిపోతుందని అనుకున్నానని అన్నారు. అయితే అందులో చాలా మార్పులు చేసినట్టు చెప్తూ కొన్ని కొత్త క్యారక్టర్లు కూడా కలిపామన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వాళ్ళలో అధిక శాతం మంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారని,  ఈ చిత్రంలో తాతగా దాసరి, మనవడిగా మంచు విష్ణు నటించారని ఆయన చెప్పారు.

తాత ఓ పల్లెటూరిలో పుట్టి పెరిగిన వ్యక్తి…..మనవడు ఆయనకు ఎంతో దగ్గరగా ఉంటాడు. వీరి మధ్య బంధాన్ని  ఎంతో ఆసక్తిగా అల్లడం జరిగింది. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. మనవడు ఒక సాఫ్ట్ వేర్  సంస్థలో పని చేస్తుంటాడు. ..ఇలా కథ సాగుతుందని చెప్పిన దాసరి కాథరీన్ కథానాయికగా ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దాసరి చెప్పారు.

Send a Comment

Your email address will not be published.