ఎవరి ఇల్లు వారిది

ఒకే ఇంట్లో జీవిస్తున్నాము మనం
ఒకే ఇంట్లో జీవిస్తున్నా
ఒకే ఇంట్లో
ఒక్కోలా జీవిస్తున్నామన్నదే వాస్తవం

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
నా ఇంటి గది గోడపై నీ ఫోటో
అయినా
నీది కాబోదు నా ఇల్లు
నీ ఇంటి గది గోడపై నా ఫోటో
అయినా
నాది కాబోదు నీ ఇల్లు

నాకు నా ఇల్లు
నీకు నీ ఇల్లు

నా ఇంటి తలుపు గుండా
నువ్వు ప్రవేశించడం కుదరడం లేదు
నీ ఇంటి తలుపు గుండా
నేను ప్రవేశించడం కుదరడం లేదు

మనం ఇళ్ళల్లోనే జీవిస్తున్నామా?
లేక
ఇళ్ళ కాపలాలో జీవిస్తున్నామా?
నాకేదీ అర్ధం కావడం లేదు

నీకు అర్ధమైతే చెప్పు…
తెలుసుకుంటాను