ఏకాంతం

నవ్వు… ఈ లోకం నీతోబాటే నవ్వుతుంది!
ఏడువ్ … నువ్వొక్కడివే ఏడుస్తావ్!
సరదాగా ఉండు .. నీకెందరో స్నేహితులు!
చిరాకుతో ఉండు …. నీ కెవ్వరూ ఉండరు!
నువ్వు ప్రయోజకుడివైతే సమాజం నిన్ను గౌరవిస్తుంది !
అప్రయోజకుడవైతే ఆ సమాజమే నిన్ను చులకన చేస్తుంది!

దాన ధర్మాలు చెయ్యి! నిన్నందరూ అభిమానిస్తారు!
నువ్వు పోయేటప్పుడు వారందరూ నిన్ను సాగనంపుతారు!
పిసినారిగా కాలం గడిపెయ్యి! నీ చుట్టూ ఎవ్వరూ ఉండరు!
పోయేటప్పుడు నిన్ను దిగపెట్టేవారు ఉండనే ఉండరు!

భోగమయ జీవితంలో అందరూ ప్రయాణికులే!
రాగమయ జీవితంలో అందరూ సమవుజ్జీలే!
అంతులేని కష్టాలు ఎదురైనాయని నిరాశ చెందకు!
నిన్ను కనికరించి సహాయం చేసేనీవారు ఎప్పుడూ ఉంటారు!
నీపై నువ్వు నమ్మకం పెంచుకో! హిమాద్రి శిఖరాగ్రానికి చేరుకో!
ఓ మనిషీ! అంతర్ధ్యానం చెయ్యి! నీ ఆత్మే నిన్నుప్రేమించేది!

—డా.రాంప్రకాష్ ఎర్రమిల్లి