ఏమి ఏమి ప్రజాస్వామ్యం ఏమది...

ఏమి ఏమి ప్రజాస్వామ్యం ఏమది…
– మందు సీస పచ్చనోటు నడిపే దౌర్బాగ్యం గాక మరెందిది

ఏమి ఏమి నాయకత్వం ఏమది…
– మౌనంగా అగుపడుతు రాజ్యగాన్ని గండి కొట్టుడు గాక మరెందిది

ఏమి ఏమి ప్రబుత్వం ఏమది…
– పేదల పొట్ట గొట్టి పెద్దల కడుపు నింపే సంస్థ గాక మరెందిది

ఏమి ఏమి అధికారగణం ఏమది…
– లంచగొండి తనంతో లబ్ధి పొంది అధికారం నిలుపుకునే నీచ తత్వమే గాక మరెందిది

ఏమి ఏమి న్యాయ వ్యవస్థ ఏమది…
– అన్యాయం నిండి ఉన్న మేడి పండు రకమే గాక మరెందిది

ఏమి ఏమి జీవన యాగం ఏమది…
– గాలి మింగి నీళ్ళు తాగే పేదరిక దుస్థితి గాక మరెందిది