ఐదు వసంతాల సాహితీ సువనం

TM-5th anni banner

capture

తెలుగుమల్లి పంచమ వార్షికోత్సవం

లాభాపేక్ష లేకుండా ప్రలోభాలకు లోనుకాకుండా ప్రవాసాంధ్రులకు అమ్మభాషలోని సాహితీ సుగంధాలు అందించాలన్న తపనతో తెలుగు భాషా పరిమళాలు ఒక మల్లెలా సువాసనలు వెదజల్లాలన్న ఆశయంతో ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల తెలుగువారికి అమ్మ భాషలో సేవలందిస్తున్న తెలుగుమల్లికి ఐదు వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు, భువన విజయ సభ్యులతో సాహితీ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత దేశం నుండి వచ్చిన శ్రీ కులశేఖరాచార్యులు గారు ప్రత్యేకించి “ఆముక్తమాల్యద” గురించి ప్రసంగించారు.

TM-5th anni

కార్యక్రమంలో ఆహూతులందిరికీ స్వాగతం పలుకుతూ తెలుగుమల్లి సంపాదకులు శ్రీ మల్లిక్దేశ్వర రావు కొంచాడ గత ఇదేళ్ళలో తెలుగుమల్లి అందించిన వ్యాసావళి మరియు తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి వివరించారు. ఆస్ట్రేలియాలో గత ఐదేళ్ళుగా తెలుగు భాషను కమ్యునిటీ భాషగా గుర్తించాలన్న అభ్యర్ధన, విదేశాలలో తెలుగెందుకు, తెలుగు భాష ప్రపంచ భాషగా గుర్తింపబడాలంటే! వంటి కొన్ని వ్యాసాలు కొందరి ఆలోచనాసరళిని మర్చాయన్నది నిర్వివాదాంశం.

అలాగే ఆస్ట్రేలియాసియా ఖండంలో మొట్టమొదటి సారిగా “శ్రీ కృష్ణ రాయబారము” మరియు “శ్రీ పార్వతీ కళ్యాణము” పౌరాణిక నాటకాలు రంగస్థలంపై ప్రదర్శించడంలో తెలుగుమల్లి మరియు భువన విజయ సాహితీ సంస్థలు చేసిన కృషి అమోఘం.

మెల్బోర్న్ తెలుగు సంఘం సౌజన్యంతో వంగూరి ఫౌండేషన్ వారు రెండేళ్లకోసారి నిర్వహించే సాహితీ సదస్సు ఈ సంవత్సరం నవంబరు నెలలో ఇక్కడ నిర్వహించడానికి తెలుగుమల్లి ప్రముఖ పాత్ర నిర్వహించింది.

రాజకీయ భౌగోళిక కారణాలవలన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు రెండుగా చీలి దాని పర్యవసానం ఇక్కడ పొడచూపినా సంయమనంతో అందరూ మెలగాలని పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవాలని తెలుగువారందరినీ ఒకే త్రాటిపై నిలపడానికి తెలుగుమల్లి ఎంతో కృషి చేసింది.

భువన విజయ సభ్యులు తమ కవితలు, ప్రసంగాలతో ఆహూతులందరినీ అలరించారు.

5th Anniv TM1

5th Anniv TM

ఈ కార్యక్రమంలో భాగంగా రెండు నిముషాలు తెలుగులో మాట్లాడుట కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో షుమారు 10 మంది సభ్యులు పాల్గొని తెలుగులో అప్పుడే ఇచ్చిన అంశాన్ని చక్కగా విసదీకరించారు. వారికీ దోసా హట్ వారు బహుమతులు అందించారు. ఈ అంశానికి శ్రీ రంప్రకాష్ యెర్రమిల్లి మరియు శ్రీమతి విజయ తంగిరాల గారు న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. వారిరువురికీ మరియు దోసా హట్ వారికీ తెలుగుమల్లి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

TM-Participants1

TM-Participants

కార్యక్రమంలో తేనీటి విందు అందించిన బిర్యానీ మహల్ శ్రీ వంశి బుడిగెకు ప్రత్యేక అభినందనలు.

ప్రముఖ అష్టావధాని శ్రీ కులశేఖరాచార్యులు గారు శ్రీ కృష్ణ దేవరాయలు వ్రాసిన “ఆముక్తమాల్యద” గురించి ప్రసంగించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసారు. చాలామందికి ‘ఆముక్తమాల్యద’ గ్రంధంగా తెలుసుగానీ ఆ కధ తెలియదు. ఈ కార్యక్రమంలో కధాపరంగా శ్రీ కులశేఖరాచార్యులు గారు పద్యాలతో సవివరంగా చెప్పడం జరిగింది. ప్రేక్షకులందరూ ఎంతో ఆనందంగా ఏకాగ్రతతో విని ఇంకా మరికొంతసేపు చెబితే బాగుంటుందని పలువురు అనడం జరిగింది. సమయాభావం వలన పూర్తీ కధను వారు వినిపించాలేకపోయారు.

IMG-20180729-WA0039s
IMG-20180729-WA0035(1)s

IMG-20180729-WA0037s

Send a Comment

Your email address will not be published.