ఓర్పు-నేర్పు

ప్రసవ వేదన నేర్పు, ప్రకృతి సిద్ధమౌ ఓర్పు!
కడుపున ఆకలి నేర్పు, ఒడలు వంచు ఓర్పు!
రోగ బాధలు నేర్పు, దేహాదుల యందు ఓర్పు!
పేదరికము నేర్పు, చదువుల నేర్చు ఓర్పు!
కష్టనష్టములు నేర్పు, సమచిత్తమను ఓర్పు!
ముద్దుల భార్యల ఓర్పు, సహజీవనం నేర్పు!
పుడమి తల్లుల ఓర్పు, సత్ప్రవర్తన నేర్పు!
గురువుకొసగిన ఓర్పు, ఆత్మజ్ఞానం నేర్పు!
పరమ పురుషుల ఓర్పు, స్థిత ప్రజ్ఞానం నేర్పు!

–డా.రాంప్రకాష్ ఎర్రమిల్లి మెల్బోర్న్