కరోన

తుఫాను కంటే వేగంగా దూసుకు వచ్చేసిందీ కరోన
భూకంపం కంటే ఎక్కువగా కంపించేసిందీ కరోన
ఆటవికుల పొదల నిప్పుకంటే తీవ్ర మైనదీ కరోన
విషవాయువుల నష్టం కంటే దారుణమైనదీ కరోన

వాయు ప్రయాణాన్నిస్తంభింప జేసిందీ కరోన
జల ప్రయణాలను ఆపేయగలిగిందీ కరోన
భూతల ప్రయాణాలకు అడ్డు గోడై నిలిచిందీ కరొన
శ్వాసలేని శవసముద్రాలను సృష్టించిందీకరోనా

రాజు పేద విచక్షణ లేదని నిరూపించిందీ కరొన
పసిపాప వృద్దుల బంధాన్ని విడదీసిందీ కరోన
చావుబ్రతుకుల నాటక సూత్రధారైందీ కరొన
సకలశాస్ర్తవేత్తలకు సవాలు విసిరిందీ కరోన

జాతిజగడాలను ఝుళిపించిందీ కరోన
కులగోడల కోటను బ్రద్దలు కొట్టిందీ కరోన
మతమలిన్యాలను కూడా కడిగేసిందీ కరోన
మానవాళంతా ఒక్కటే అని చాతి చెప్పిందీ కరోన

_ సూర్య అయ్యసొమయాజుల, కాన్బెర్రా