కలహాంతరిత

ఏమి సేతునో,నేనేమి సెతునొ.
అలసి శొలసీల్లు జేరిన విభుని
అందాల ప్రియుని .ప్రెమమీర పలుకరించి
సేద దీర్చ్నైతిని, ॥ ఏమిసేతునో ॥

స్నాన పాణాదులు చేయించి ,
ఆదరము మీర ఆరగింపజేసి ,
అలంకారముల ,ప్రేమనురాగాల ,
మురిపించి మరపింపక ,కసిరితి దూరితి ,
తూలనాడి దుర్భాషలాడి ,
అహంకారముగా అలిగి తొలగితి ,॥ ఎమేసేతునో ॥

ఇంత జేసినగాని ఒక పలుకైన పలుకక వెడలి పోయే ,
ఏమనుకోన్నో . ఎటు బోయనో,
ఏరీతి మరలి వచ్చునో ,
నావిభుడు ఏరీతి మరలి వచ్చునో ॥ ఏమిసేతునో ॥

నెలరాజు మలిగిపోయే,
జిలి జిలి బిలి తారలన్ని పరిహసించే ,.
కురుల విరులు వాడి రాలి పోయే ,
ఝాము రేతిరి గడిచే
అలిగి వెడలిన ప్రియుడు రాదాయె రాదాయె,
ఏమిసేతునో నేనేమి సేతునో,
——————————————-
కామేశ్వరి సాంబమూర్తి పి .ఎ .యు. ఎస్ ..ఎ