కాగితం - పెన్నూ

ప్రేమా…..
నువ్వు పెన్నువి. నేను కాగితాన్ని.
ఏదైనా రాయి నీ హృదయంతో …
నువ్వు రాయడం కోసమే
నా హృదయాన్ని ఖాళీగా ఉంచాను.

నా నిద్రా ఒక కాగితమే
అందులో నువ్వు నీ కలలతో రాయి….

నా యవ్వనప్రాయమూ ఒక కాగితమే
అందులో నువ్వు నీ అనుభూతులను రాయి…

నా మార్గము ఒక కాగితమే
అందులో నువ్వు నీ పాదముద్రల విషయాలను రాయి….

నా జీవితమే ఒక కాగితము
అందులో నీ వర్ణనలను రాయి….

నా ఏకాంతము ఒక కాగితమే
అందులో నీ జ్ఞాపకాలను రాయి….

కొన్ని సమయాలలో నువ్వే కాగితమవుతావు
ఎన్నో ప్రశ్నలకు జవాబులు రాసాను
కానీ
జవాబు తెలియని ఒక ప్రశ్న
నీ చూపుల సారం
నువ్వనుకుంటే
నీ చూపుల సైగలతో
నా యవ్వనాన్ని ఎప్పటికీ తాజాగా ఉంచగలవు

నువ్వు కనిపించకపోతే
నా కన్నీళ్లు రాస్తాయి నీ మీద కవితలు

– యామిజాల జగదీశ్