కీలకపాత్రలో సుహాసిని

కీలకపాత్రలో సుహాసిని

రంజీవి సినిమాలో కీలకపాత్రలో సుహాసిని

చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో తన నటనతో ఆనాటి ‘ఉయ్యాలవాడ’ను మరిపించారు. ఆ తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదిలా ఉండగానే చిరంజీవి మలయాళంలో పెద్ద విజయం సాధించిన ‘లూసిఫర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీపై పతాకంపై నిర్మించనున్న ఈచిత్రంలో అలనాటి నటి సుహాసిని కీలక పాత్రలో నటించనుందని సమాచారం. ‘సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్‌’ చిత్రానికి తెలుగు వాసనలకు తగ్గట్టుగా స్ర్కిప్టులో మార్పులు కూడా చేస్తున్నారని సమాచారం. గతంలో చిరంజీవి సుహాసిని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘ఎంతమంచి వాడవురా’లో సుహాసిని గృహణిగా నటించింది. ఇక నాటి కథానాయిక విజయశాంతి కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఫ్రొఫెసర్‌ భారతిగా మెప్పించింది. ఈ విధంగా అలనాటి నటీమణులు మరోసారి తెరపైకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.