కొత్త జంట పాటల సంబరాలు

కొత్త జంట పాటల సంబరాలు
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అయిన అల్లు శిరీష్, రేజీనా  జంటగా నటించిన కొత్తజంట  చిత్రం పాటల సంబరాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటల సి డీ ని సుప్రసిద్ధ దర్శకులు కె రాఘవేంద్ర రావు ఆవిష్కరించారు. మొదటి సి డీ ని వీ వీ వినాయక్ స్వీకరించారు. జె బీ స్వరాలూ అందించారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు కాగా అరవింద్ సమర్పిస్తున్నారు.
ఏ కథానాయకుడికైనా ఒక మంచి హిట్ చిత్రం అవసరమే. అలాగే శిరీష్ కు కూడా అలాంటి హీర్ చిత్రం ముఖ్యమని అల్లు అర్జున్ అన్నారు. దర్శకుడు మారుతి చిత్రాలకు ఓ గుర్తింపు ఉందని, తన సోదరుడు నటించిన ఈ చిత్రాన్ని అభిమానులు  ఆదరిస్తారనే నమ్మకం తనకుందని అల్లు అర్జున్ చెప్పారు.
ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథాచిత్రం వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చిన జె బీ (జీవన్ బాబు) ఈ చిత్రానికి కూడా వినసొంపైన సంగీతం అందించారు.  ఇందులోని “ఓసీ ప్రేమ రాక్షసి …:” పాట తప్పకుండా హిట్టవుతుందని సంగీత దర్శకుడి విశ్వాసం.
ఇదొక కుటుంబ కథా చిత్రం. వినోదానికి ఏ లోటూ  ఉండదని నిర్మాత “బన్నీ” వాసు చెప్పారు.
మారుతి స్క్రిప్ట్, కథకు తగ్గ టైటిల్ తనకెంతో నచ్చాయని  ఆయన తెలిపారు. సంగీతపరంగా ఇదొక గొప్ప హిట్ కొడుతుందని ఆయన నమ్మిక. ఈ వేసవిలో ఇది విజయవంతమవడం తధ్యమని చెప్పారు.
పాటల విడుదల కార్యక్రమానికి బీ వీ ఎస్ ఎస్ ప్రసాద్, హరీష్ శంకర్, సుకుమార్, జెమినీ కిరణ్, నల్లమలుపు బుజ్జీ, డా. కె వెంకటేశ్వర రావు, సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇలా ఉండగా, ఈ చిత్రంలో నటించిన హృదయ కాలేయం ఫేం సంపూర్నేష్ సీన్లు కత్తిరించి ఆ సీన్లలో మరొకరిని నటింప చేసి  షూట్ చేసినట్టు సమాచారం.  అల్లు అరవింద్ సూచనమేరకే ఇదంతా జరిగినట్టు తెలిసింది. గౌరవం చిత్రంతో కెరీర్ ప్రారంభించిన శిరీష్ కు ఆ మొదటి చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు ఇలా సంపూ సన్నివేశాలను కొత్తజంత చిత్రంలో ట్రిమ్ చేసిన తీరు వల్ల శిరీష్  కెరీర్ కు అంత మంచిది కాదని కొందరి అభిప్రాయం. దర్శకుడు మారుతి చేతిలో ఏమీ లేదని, ఆయన కేవలం తన బాస్ అల్లు అరవింద్ మాటలు  విని వాటిని అనుసరించడం తప్ప చేసేదేమీ లేదని అనుకుంటున్నారు.
పాపం సంపూ… చేసేదేమీ లేదు ఎవరైనా….

Send a Comment

Your email address will not be published.