ఖండిత--అష్థ విధ శృంగార నాయిక

ప్రియునితో —–

రేతిరంత ఏడనుంటివొ విభుడా నాప్రియుడా ,ఏడనుంటివొ ,
నిండు పున్నమీ నీరుగారిపోయే ,
పండు వెన్నెలా మసక బారిపోయే,
ముడిచిన కురుల తురిమిన మల్లె ,జాజి విరులు ,
ముకులించుకు రాలి పోయె,।। రేతిరంతా ॥

నా కాటుకకళ్ళు నీకై ఎదురుచూపుల ,
కంటి నీరై పారే ॥ ఏ డనుంటివొ ॥

ఏమను కొంటివొ ,ప్రియుడ ॥
తెల తెలవారే తొలికోడి కూసే ,
జాలువారు వేకువ ఝామున
మెల మెల్లగ మార్జాలము వోలె
ఇల్లు జేరితివి ॥ఏడ నుంటివో విభుడ ॥

ఇంత దనుక దేనితో నున్నవో
చెప్పకనే చెప్పేను నీవైనం మౌనం ,
నఖముల గాట్లు, దంత గాతలు ,
పోవోయి, పోవోయి దాని చెంతకే పోవోయి ,
రాబోకు దరికి రాబోకు,
,రాబొకు బొంకులేవి చెల్లబోవు ,
ఆ వగలాడి చెంతకె పోవోయి పోవోయి

————————————————–

కామేశ్వరి సాంబమూర్తి .భమిడి పాటి .