గోపీచంద్ దర్శకత్వలో బాల‌కృష్ణ

గోపీచంద్ దర్శకత్వలో బాల‌కృష్ణ

గోపీచంద్ మ‌లినేని దర్శకత్వలో నటిస్తున్న బాల‌కృష్ణ

ఇటీవలే ‘అఖండ’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు గోపీచంద్ మ‌లినేని మూవీలో న‌టించ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నారు. ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన గోపీచంద్ మ‌లినేని.. బాల‌కృష్ణ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు స్టోరిని డెవ‌ల‌ప్ చేశాడ‌ట‌. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్ మేర‌కు ఈ సినిమాలోనూ బాల‌య్య డ్యూయెల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇప్పుడు అఖండ సినిమాలో డ‌బుల్ రోల్‌లో మెప్పించ‌నున్న మ‌రోసారి అలాగే అల‌రించ‌బోతున్నాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమంటే, ఓ పాత్ర‌లో ఫ్యాక్ష‌నిస్ట్‌గా మ‌రో పాత్ర‌లో స్వామిజీగా అల‌రించ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

మ‌రో వైపు మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఓటీటీ మాధ్య‌మంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ‘ఆహా’, లో అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ టాక్ షోకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇప్పుడు జ‌రుగుతోంది. న‌వంబ‌ర్‌లో బాల‌కృష్ణ త‌న 107వ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు జై బాల‌య్య అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో త్రిష్ ఓ హీరోయిన్‌గా క‌నిపించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రాయ‌ల‌సీమ‌, క‌ర్ణాట‌క బోర్డ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంద‌ట‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.