గోపీచంద్ హీరొగా 'పంతం'

గోపీచంద్ హీరొగా 'పంతం'

గోపీచంద్ హీరోగా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ గా ‘పంతం’ అనే సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.
సమాజంలో మార్పు రావాలంటే నాయకులను ఎన్నుకునే ఓటర్లలో చైతన్యం రావాలంటున్నారు ఈ సినిమా హీరో గోపీచంద్‌. కె. చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘పంతం’. ‘ఫర్‌ ఎ కాజ్‌’ అనేది ఉపశీర్షిక. ఇందులో మెహరీన్‌ కథానాయిక. షూటింగ్‌ పూర్తయింది.

‘‘డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో గోపీచంద్‌ను చూడబోతున్నారు. యూ.కె షెడ్యూల్‌ చిత్రీకరణతో టాకీ పార్ట్, పాటలు పూర్తయ్యాయి. ప్రోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌ తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 5న సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పృథ్వీరాజ్, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్‌.

Send a Comment

Your email address will not be published.