న్యూ జీలాండ్ తెలంగాణ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.
ఒక దశాబ్దం అలుపెరుగని పోరాటాన్ని సాగించి రాష్ట్ర సాధన ఒక ఎత్తైతే గత నాలుగేళ్లలో దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణా రాష్ట్ర పధకాలను ఆదర్శంగా తీసుకొని అమలుపరుస్తున్న స్థితికి చేరుకోవడం ఎంతో ముదావహం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా, రైతన్నే కధా నాయకుడని గ్రహించి గాంధీ గారు కలలుగన్న భారతావనికి ఊతమిచ్చి ముందుకు సాగుతున్న తెలుగు రాష్ట్రం తెలంగాణా. ఈ రాష్ట్రావతరణ దినం ఆక్లాండ్ మహానగరంలోని మౌంట్ ఈడెన్ వార్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి . ఆక్లాండ్ లోని 29 భారత రాష్ట్రాల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరై జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ పౌరుషాన్ని జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు . ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి , మౌనం పాటించిన అనంతరం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు , జానపద కృతులు,రాధికా రానా (కథక్ ప్రదర్శన), అవంతిక, గ్రీష్మ, కీరు, శ్రీజ, సేజల్, మేధ, సంకీర్తన, హిరాల్, అక్షిత, సాత్విక, సమీక్ష, అమితి, అథిర, హైమీ, నీతిక, సిరి కోల బ్రాండ్ తెలంగాణ హైదరాబాద్ లక్క గాజులను ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ప్రదర్శనలు అందరిని అలరించాయి .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, ఆక్లాండ్ ఇండియన్ హై కమిషన్ గౌరవ కాన్సులెట్ భవ్ దిల్లోన్ గారు , ప్రకాష్ బిరాధర్ గారు , న్యూ జీలాండ్ ఇండియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ , తమిళ్ నాడు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రవీంద్రన్ వై.హాజరయ్యారు
ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడు , కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు హాజరయ్యారు . భవ్ దిల్లోన్ సభికులందరితో జై తెలంగాణ నినాదాలు చేయించి తెలంగాణ పై వున్న ప్రేమను చాటుకున్నారు .
తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ , తెలంగాణ ఉద్యమం లో అమరవీరులు , కెసిఆర్ గారు, జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు , కోదండరాం ల ను గుర్తుచేసుకుని, తెలంగాణ సంస్కృతీ , సంప్రదాయం , భాష , యాస మరియు మన తెలంగాణ ఆత్మ గౌరవాలకు ప్రతీక , అందరి గొంతుక మన తెలంగాణ అసోసియేషన్ అని తెలిపారు . తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు .
అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు
సురేందర్ రెడ్డి ఆడవెల్లి – జనరల్ సెక్రటరీ
రామ్మోహన్ దంతాల – ఉపాధ్యక్షుడు
ఉమారామారావు రాచకొండ – ఉపాధ్యక్షురాలు
వినోద్ రావు ఎర్రబెల్లి – కోశాధికారి
విజేత రావు యాచమనేని – జాయింట్ సెక్రటరీ
లక్ష్మణ్ కలకుంట్ల ,ప్రసన్న కుమార్
రామ్ రెడ్డి తాటిపర్తి ,శ్రీహరి రావు బండ ,నర్సింగ్ రావు పట్లోరి
Advisory కమిటీ
1.నరేందర్ రెడ్డిపట్లోళ్ల
2.జగన్ రెడ్డి వొదినాల
3.రామ రావు రాచకొండ
4.శ్రీనివాస్ పానుగంటి
5.నర్సింహా రావు పుప్పాల
పాల్గొన్నారు . కార్యక్రమ అనంతరం అందరికి విందు భోజనం ఏర్పాటు చేసారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.