చరణ్‌కు హీరోయిన్‌ గా రష్మిక

‘ఆచార్య’లో చరణ్‌కు హీరోయిన్‌ గా రష్మిక

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మండన్న అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ‘గీతా గోవిందం’ బ్లాక్‌బస్టర్‌ తరువాత రష్మిక ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ మూవీ తరువాత అమ్మడు స్టార్‌ హీరోలతో నటించే అవకావాలు దక్కించుకుంది. స్టార్‌ హీరో మహేబ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించి టాలీవుడ్‌ గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’లో నటిస్తోంది. ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు ఆమె కోసం క్యూ కడుతున్నారనడంలో సందేహంలేదు. ఇదిలా ఉండగా మరో టాలీవుడ్‌ స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ దక్కించుకున్నట్లు ఇండిస్టీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు తనయుడు రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. కాగా చరణ్‌ హీరోయిన్‌ను ఫిక్స్‌ చేయకపోవడంతో ఎవరు నటిస్తారా? అని కొంత కాలం ప్రచారం జరిగింది. కాగా, చరణ్‌ సరసన హీరోయిన్‌ కోసం రష్మికను సంప్రదించినట్లు సమాచారం. ఆమె అంగీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరో రెండు వారాల్లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించాలని కొరటాల భావిస్తున్నారట! ముందుగా చరణ్‌ నటించబోయే సన్నివేశాలను షూట్‌ చేయాలనుకుంటున్నారట. అంటే రష్మిక త్వరలోనే చరణ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొననుందని సమాచారం.

Send a Comment

Your email address will not be published.