‘చాణక్య’ న్యూ లుక్‌

chanakyaగోపీచంద్‌ ప్రతినాయకుడిగా, నాయకుడిగా టాలీవుడ్‌లో తనదైన మ³ద్ర వేసిన నటుడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గోపీచంద్‌ జన్మదినం సందర్భంగా చాణక్య సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేసిందీ చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో ఆయన బ్లాక్‌ టీ షర్ట్, బ్లాక్‌ ప్యాంటు, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని రఫ్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఇప్పటికే అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్‌కు జంటగా మెహరీన్‌ కనిపించనుంది. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తమిశ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.