చిన్న వయసులోనే వృద్ధాప్యం

stress“కొంతమంది కుర్రవాళ్ళు- పుట్టుకతో వృద్ధులు” అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో గానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తక్కువ వయసులోనే చాలామంది వృద్ధాప్యానికి చేరువౌతున్నారు. దీనిపై ఒక ఆధ్యయనంలో తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనలతో మానవ మెదడుకు త్వరగా వృద్ధాప్యం వస్తుందని తేలింది. సైకలాజికల్ మెడిసిన్ అనే జర్నల్‌ (లండన్) లో ప్రచురితమైన తాజా అధ్యయ నం ప్రకారం.. మెదడుపై మానసిక ఒత్తిడి చూపే దుష్ప్రభావాన్ని చాలా స్పష్టంగా ప్రయోగాత్మకంగా గుర్తించినట్టు అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు మొత్తం 34మందిపై కూలంకషంగా జరిపిన అధ్యయనంలో ఒత్తిడి లేదా ఆందోళనల ప్రభావం మెదడుపై ఎలా ఉంటుందో పరిశీలించగా ఈ విషయం మరోమారు రుజువైంది. మానసిక కుంగుబాటు లక్షణాలున్నవారితో పాటు ఈ వ్యాధి బారినపడ్డ 71,000 మంది నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా ఆమూ లాగ్రం విశ్లేషించగా.. మతిమరుపు, సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం, విషయాన్ని విశ్లేషించే పరిజ్ఞానాన్ని సైతం వీరు క్రమంగా కోల్పోతున్నట్టు తేలింది. వృద్ధుల కంటే మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారిలో ఈ లక్షణాలు మరీ ఎక్కువ ఉన్నట్టు అధ్యయనం తేల్చడం విశేషం.

ఈ కుంగుబాటు సమస్యకు చికిత్స లేక పోవడంతో ఈ లక్షణాలను తొలి దశలోనే గుర్తించడం అత్యవసరమని వైద్యులు చెబుతున్నారు. మరో 30 ఏళ్లలో కుంగుబాటుకు గురయ్యే వారి సంఖ్య మరింత పెరగనుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆందోళన, తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్న వారిని అ యినవారు మానసికంగా అండగా నిలిచి కాపాడుకోవ డం ఒక్కటే దీనికి విరుగుడని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వాలు సరై న ప్రాధాన్యత ఇచ్చేలా మరిన్ని సూచనలు మానసిక శాస్త్రవేత్తలు ఇవ్వాలని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.

Send a Comment

Your email address will not be published.