చిరంజీవి సరసన తమన్నా

చిరంజీవి సరసన తమన్నా

భోళా శంకర్‌లో చిరంజీవి సరసన తమన్నా

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘భోళా శంకర్‌’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. నవంబర్‌ 11న ఈ మూవీ పూజ కార్యక్రమం జరగనుందని, నవంబర్‌ 15 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు ఇటీవల చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో చిరుకు జోడి కట్టనుంది ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార పేరు వినిపించగా కొద్ది రోజుల నుంచి తమన్నా పేరు తెరపై వచ్చింది.

తాజాగా మేకర్స్‌ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. తమన్నా హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు తాజాగా మూవీ యూనిట్‌ అధికారిక ప్రుకటన వెలువరిచింది. అలాగే తమన్నా కూడా తన ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడి‍స్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమన్నా ట్వీట్‌ చేస్తూ.. ‘మెగా మాసివ్‌ సినిమా భోలా శంకర్‌లో నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. చిరంజీవి గారితో కలిసి మరోసారి నటించడానికి ఎంతో ఆతృతగా ఉంది. దర్శకుడు మెహర్‌ రమేశ్‌ గారు దీనిని నిజం చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది.

ఇప్పటికే తమన్నా సైరా నరసింహ రెడ్డిలో చిరుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమన్నా రెమ్యునరేషన్‌పై కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం తమన్నా సంప్రదించగా మిల్కీ బ్యూటీ ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్‌ చేసిందని, చిత్ర యూనిట్‌ కూడా దాని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక భోళా శంకర్‌ సినిమా విషయానికొస్తే ఈ సినిమాను తమిళంలో సంచలన విజయం సాధించిన వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తోంది.