చెలీ..నా అంతరంగ వాణి

వెన్నెల రేయి నీవె
వెచ్చని హాయి నీవె
వేదనల చీకటిలో
వేకువ కిరణం నీవె….వెన్నెల

నా పాట నీ కొరకె
నా బాట నీ వరకె
నా బాషలో ప్రాస
నీ ప్రేమే నా శ్వాస …వెన్నెల

చెలీ మన ఇరువురి దూరం
చెప్పలేని మానస భారం
చెలీ నా వలపుల గమ్యం
చెలి చూపే రసరమ్యం … వెన్నెల

ఆరాధ్య దైవం నీవు
అర్చన కుసుమం నేను
అనుగ్రహం నా కోరిక
అనురాగం నీ కానుక ….వెన్నెల