జనరంజని - ఓ కవితా భావన

ఆకాశంలో మిల మిల తారలు
మిణుక్కులాపి భువి వంక వీక్షించె

నింగిలో నెలవంక మరింత వెలుగుతో
తొంగి తొంగి నేల వంక దృష్టి సారించె

భాద్రపద మేఘాలన్నీ వర్షించక
దేనికో ఎదురు తెన్నులు జూసె

మలయ మారుతమెన్నడూ లేని విధంగా
జడత్వమై స్తంభించి పోయె

భూప్రదక్షిణం మూడు గంటలసేపు
ఎలా గడిచిందో అగమ్య గోచరమాయె

పక్షులన్నీ తమ గూళ్ళకెళ్ళక
స్ప్రింగువేలు హాలు చుట్టూ గుమి గూడె

ఇదేమిటి చెప్మా! అని జీవ కోటి అంతా
సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలె

జనరంజని 2013 కారణ భూతమని తెలిసి
మదిలో ఏదో తెలియని విస్మయమాయె