జయ నామ ఉగాది

కూసింది కూసింది ఓ కోయిల
ఉగాది వేళ ఏదో హాయిలా || కూసింది||
జయం జయం జయ నామం
శుభం శుభం శుభ గానం || కూసింది||
మావి చిగురులు వేప పూతలు
మల్లె పూవుల గుబాళింపులు || కూసింది||
గ్రీష్మ తాపాలే ప్రకృతి దీవెనలు
వడగాల్పులే పరమ పద సోపానాలు || కూసింది||
లోకమంతా సుఖ శాంతులు
అనుక్షణం ఈశ్వరుని ఆశీస్సులు || కూసింది||