జై తెలుగు జననీ !

ఏ ఖండమేగినా నిలుపండి
మదిలో మాతృ భారతినీ !

అదే స్ఫూర్తితో కొలువండి
గుండెల్లో మీ తెలుగు జననినీ !

ఈ భువి దశదిశలా గుబాళించే
అతి దివ్య పరిమళం తెలుగు !

సరస సాహితీ జనరంజని తెలుగు !
సహృదయ కవన కడలి తెలుగు!

రచ్చగెలిచిన మేలిమిజాతి తెలుగు !
నవయుగ భువి సంధాయిని తెలుగు!

ఆ ఘనతని సాధించింది ఈ తరం,
అదే కొనసాగాలి మన తదనంతరం !