జై తెలుగు భారతీ !

జయ జయహో తెలుగు భారతీ
జయహో జయ మాతృమూర్తీ

దివి అష్ఠాదిశల అవధులు దాటి
సప్తమ ఖండావని తీరాన వెలుగు
భువి ఆస్ట్రేలియా తెలుగు జననీ
ఈనేల నెదుగు మమ్మేలు తల్లీ

మేలిమి మెల్బో తెలుగుదనం
ఈ ధాత్రి నలుమూలల నిలువగా
భరత జాతి అఖండ ఘన కీర్తి
ఈ దూరద్వీప లోగిళ్ళ వెలుగగా

నీ కరుణాభరితకర కమలాలతో
అందించు మాకు బంగారు భవిత
దీవించు తల్లీ మా చిన్నారుల నెల్ల
కాపాడు జననీ మా జనావళినంతా

గడ నడక నడయాడు జీవనం నాది
సాహితీ సన్యాస యుగ సంచారిని నేను
మేలిమి తెలుగు భాషా సంవేదిక ఇది
యిట వెలుగు సాహితీ దివ్వెలు మీరు

తెరవండి మేధో తెరల్ని కదుపండి కలాల్ని
ఇది నేటి మహిమాన్విత కవననోద్యమం
మొదలిడండి ప్రతిభా పాటవ విజృంభణం
మీ నవ్యదివ్య రచనాసాహితీ ప్రభంజనం

జయహో జయ మాతృమూర్తీ
జయ జయహో తెలుగు భారతీ