తనువులు

ఆన్నానులె చెలి
ఆనుకున్నానులె జాబిలి
కవిత నీవని కవిని నేనని
తెలుసుకున్నానులె

ఆశలున్న మనసులోన బిడియమున్నదిలె
బిడియమె స్త్రీ ధనము అని నాకు తెలియునులె
నీవు నా ప్రేమలొ చెలియ నేను నీ ఊహలో
తనువులె మనవి రెండు హ్రుదయమొకటేలె……..

అన్నానులె చెలి
అనుకున్నానులె జాబిలి
కనులు నీవని కలలు నావని
తెలుసుకున్నానులె

సృష్టిలొ సౌందర్యమంతా ప్రియా నీదెలే
ద్రుష్టిలొ ఆనందమంత సఖి నాదెలే
యుగళ గీతాలలొ మరియు వలపు భావాలలో
ప్రేమ జగమై ఇరువురు సగమై సాగిపొదాములే

అన్నానులె చెలి
అనుకున్నానులె జాబిలి
శిల్పము నీవని శిల్పిని నేనని
తెలుసుకున్నానులె

–సుధీర్ మండలీక