తరతరాలకు స్పూర్తిదాయకం

నేటితరానికి స్పూర్తిసంతకం అబ్దుల్ కలామ్
అక్టోబరు 15 ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 88వ జయంతి
————–
APJ Abdul Kalam

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ జయంతి నేడు (అక్టోబర్ 15, 1931). భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.. ఆయన జీవిత పుటల్లోకి తొంగిచూస్తే ఆయ్న మాటల్లోనే….
“ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాణ్ణి. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. ‘మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి’

ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం తనకు ముగ్గురు అమ్మలంటేabdulkalam చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. ‘ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా’ అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు’ అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. ‘ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను’ అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు.

కలాం తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డృడో) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-ఈఈ అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.

బాల్యం మరియు విద్యాభ్యాసం
అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు.

పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు మరియు ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ “కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను” ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడరు.

శాస్త్రవేత్తగా మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ డీఆర్డీఓ లో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో (ఇస్రో) చేరి, ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్ ఎల్ వి) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచెసి జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. [ఇస్రో]లో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ ఎస్ ఎల్ వి, ఎస్ ఎల్ వి 3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి. 1970 లలో స్థానికంగా తయారైన ఎస్ ఎల్ వి రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-2 అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు “మిస్సైల్ మాన్” అని పేరు వచ్చింది. జూలై 1992లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.

A Kalamభారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్ (1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు.

కలామ్ శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి. కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. “ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు” అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్తో బాటు, భగవద్గీతను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు, మానవతావాది. ఆయన తిరుక్కురళ్లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క “పాశురం” నైనా ప్రస్తావిస్తారు.

కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నారు. ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బయో ఇంప్లాంట్స్ వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ నే సమర్థిస్తారు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.

కలాం ఇండియా 2020 – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్, ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్,
Kalam jiఇండియా-మై-డ్రీం, ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ – రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

Send a Comment

Your email address will not be published.