తిరంగకు నమస్కరిస్తున్న త్రిలింగ

సాధుతత్వమును సూచించే కాషాయము ఎగరంగ
శాంతి భద్రతల సురక్షితాలు తెలుపుతో తెలపంగ
సస్యశ్యామల పచ్చదనాలను పింగళి వెంకడు అద్దంగ
రెప రెప లాడుతూ ఎగిరింది నా అందాల తిరంగ

భూమాతకు కస్తూరీ తిలకము వలె నా భరత మాత నిలవంగ
దశావతారాలలో జన్మించుటకు విష్ణువు ఈ జంబూ ద్వీపమునే ఎంచంగ
అందమైన హిమాలయాలు, మానస సరోవరాలు నా దేశం లో వెలవంగ
రుద్రాక్షుని కటాక్షముతో పుణ్య భాగీరదులు నా దేశం లో పారంగ

సకల జన సౌభ్రాతృత్వ భావాన్ని నా దేశం ప్రపంచానికి చాటంగ
అథిది దేవోభవ అంటూ నమస్కరిస్తూ వినయంగ
ఎన్నొ జన్మల సుకృతం వలన నేను ఈ గడ్డపై జనయించంగ
నివ్రితి నిండిన హృదయం తో తిరంగకు నమస్కరిస్తున్నాడు ఈ త్రిలింగ

శ్రీ కృష్ణ రావిపాటి
బ్రిస్బేన్