తెలుగులో తొలి సూపర్ గర్ల్

తెలుగులో తొలి సూపర్ గర్ల్

తెలుగులో తొలి సూపర్ గర్ల్ మూవీ ‘ఇంద్రాణి’

హాలీవుడ్‌లో చిత్రాలలో మాత్రమే ఇప్పటివరకు సూపర్ హీరోస్, హీరోయిన్స్‌ చూసుంటాం. ఇటీవల భారత సినీ పరిశ్రమలో సూపర్‌ హీరోస్‌ పాత్రలో కూడా పలు సినిమాలు వచ్చాయి. కానీ సూపర్‌ గర్ల్‌ పాత్రలో వచ్చిన సినిమాలు లేవు. ఈ లోటును భర్తీ చేసేందుకు వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్‌ బాబు నిర్మాతగా ఒక సూపర్ గర్ల్‌ మూవీ తెరకెక్కబోతోంది. తెలుగు తెరపై గతంలో ఎప్పుడూ చూడన విభిన్నమైన కథాంశంతో ‘ఇంద్రాణి’ అనే సినిమాను రూపొందించునున్నట్లు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. యాక్షన్‌ సన్నివేశాలతోపాటు కమర్షియల్‌ హంగులు జోడించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న స్టీపెన్‌ న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో శిక్షణ తీసుకున్నారట. రెండేళ్లపాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి ప్రతి అంశంపై సీరియస్‌ వర్క్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌తో పాటు కొత్త నటీనటులకు అవకాశం ఇస్తున్నారు. అందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపింది చిత్రబృందం. ఇండియన్‌ సినిమాల్లోకెల్లా విభిన్న చిత్రంగా ఈ మూవీ ఉంటుందని మేకర్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సాయి కార్తీక్‌ అందించబోతున్న సంగీతం సినిమాకే హైలెట్‌ కానుందన‍్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ‍్యతలు చేపడుతున్నారు. అతి త్వరలో ‘ఇంద్రాణి’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.