తెలుగు వెలుగు

సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు
నేటి గరళభరిత నూతనసాహితీతీరుతెన్నులు
నవపథాన వెలిగిపోతోన్నపరభాషాకరదీపికలు
దీనస్థితిలోన నిలిచిపోయిన తెలుగువెలుగులు

హిందుస్తానీ అంగ్రేజీల పదప్రయోగ బోధనలు
తెలుగుసాహిత్యాన్నిపాతాళానికీడుస్తున్నాయి
నవ కవుల తెలుగు సాహితీ దారి తీరులు
నేటినాట్య పాదకదలికల నలిగిపోతున్నాయి

అడ్డులేని పరభాషాపదచౌర్యం పదిలమవుతోంది
ఎవరడ్డుపడాలి ఈ తెలుగు భాషా సంహరణకి
మాతృ భాషా సేవకి ఎవరూ రారేమి ముందుకి
మన తెలుగుమార్గం కానున్నదిఅగమ్యగోచరం

అలనాటి ఓనాటి మాతృభాషా పోషకులారా
కదలిరండి నిలుపండి మనసాహితీ విలువల్ని
అవనతం అడ్డుకోండి దీన కవితా వేదనల్ని
కడలినీటి పరం కానీకండి సుకవితా ధారల్ని

నవసాహితీలోక దుర్మదాంధులార జాగరతహో
రాష్ఠ) ప్రభుత్వమా నిలుపుడీ భాషా ద్రోహాన్ని
ప్రకటించండి శిక్షల్నిఈ అసాంఘిక నేరానికి
వెలిగించండి మరల మన తెలుగు దీపికలని !

Leave a comment

Send a Comment

Your email address will not be published.