" తేట గీతి " పోత

" తేట గీతి " పోత

సంధి చందసు రహదార్ల సాగుటన్న
లఘువు గుర్వాశ్వ లాఘవ లంఘ మన్న
సొగసునుడి సమాసములను సొత్తు లున్న
భువన విజయపు దుందుభి చెవినిడన్న

పల్ల వులు చరణమ్ముల పాట కట్ల
కధలు కధనాలు నవలలు కవితలున్న
తెలుగు భాషది మనదంచు తెలియుమన్న
మీరు మేమనునెడమట మృగ్య మన్న

వెన్న మీగడలనుతీపి కన్న మిన్న
భాష యన్నదె మనమధ్య పాశమన్న
పసిడి కంటెను విలువైన భాష రన్న
గుండె సప్పుళ్ళ కునికున్న గుట్టురన్న

పలక రింపుల తోడనే పులకలన్న
పల్లె పదములకును సాట దెల్లసున్న
పోత నార్యు శ్రీనాధుల పొంగ దన్న
యేలు నేడుకొండలవాని జోలరన్న

హరికధా కీర్తనముకిడు యాలపనము
యక్ష గానమెంకికినిక రక్ష యనుము
కన్ను రెప్పయి తెలుగమ్మ కాపు గనుము
తెలుగు మల్లెల సొగసును కొలుచుకొనుము

దివ్యమైనటి మనమాట శ్రావ్య మనుము
యితర దేశమె మెచ్చిన యింపు గనుము
ప్రాక్ప్ర పంచపిటాలియ ప్రథయె సుమ్ము
అమ్మభాషకు సరిలేదు నవనిలెమ్ము

సూర్యనారాయణ సరిపల్లె

Send a Comment

Your email address will not be published.