త్వరలో రాబోతున్న 'క్రిష్‌ 4'

Krrish4సూపర్‌ హీరో ప్రాంచైజ్‌ ‘క్రిష్‌’లో మరో భాగం రాబోతుంది. అది క్రిష్ 4. ఈ ప్రాంచైజీలో ఇప్పటి వరకూ వచ్చిన ‘కోయి మిల్‌ గయ’, ‘క్రిష్‌’, ‘క్రిష్‌ 3’ బాక్సాఫీస్‌ వద్ద మంచి బిజినెస్‌ చేశాయి. ఇప్పుడు 4వ భాగం రాబోతుంది. ఇందులో హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్నాడు. అతని తండ్రి రాకేష్‌ రోషన్‌ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. గత ఏడాదే ‘క్రిష్‌ 4’ రూపొందించనున్నట్టు రాకేశ్‌ రోషన్‌ వెల్లడించారు. కానీ అతనికి క్యానర్స్‌ సోకడంతో దాని ట్రీట్‌మెంట్‌కు సమయం తీసుకోవడం వల్ల ఇప్పటి వరకూ ఈ సినిమా పట్టాలెక్కలేదు. అనారోగ్య పరిస్థితుల నుంచి కోలుకున్న అతను ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

హృతిక్‌ రోషన్‌ ‘వార్‌’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మాట్లాడుతూ తన తండ్రి రోషన్‌ ఆరోగ్యం కుదుట పడిందని చెప్పారు కూడా. ఇక ‘క్రిష్‌ 4’ పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైపోయారు. ఈ ప్రాంచైజీలో ఇదే ఫైనల్‌ చిత్రం. ఇందులో నటీనటులు ఎవరు? అన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు. ‘అవెంజర్స్‌’, ‘2.ఓ’లో ఏవిధంగా సాంకేతికతను ఉపయోగించారో ‘క్రిష్‌ 4’లోనూ ఆ మాదిరిగానే వీఎఫ్‌ఎక్స్‌ను వాడాలని భావిస్తున్నారట. ఇప్పటివరకూ వచ్చిన వాటికి మించి ఎక్కువ గ్రాఫిక్స్‌తో ఈ సినిమా చేయాలని భావిస్తున్నారు. ‘కాబిల్‌’ ఫేమ్‌ సంజరు గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించవచ్చు. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లే ముందు మిగిలిన నటీనటులు వివరాలను వెల్లడించనున్నారు.

Send a Comment

Your email address will not be published.