దసరా పండుగ

నిశుంభ శుంభ దైత్య కృత్య నీచ తీవ్రవాదమున్
నశింప జేసి దుష్ట శిక్షణంబు జేయు దుర్గవై
కృశించు మంచి పెంచి , దుష్ట కీటకాల సంకటం
దృశాగ్ని బెట్టి సంహరించు దివ్య శాక్త చండివై ,
ప్రశాంత సాగరమ్ము లో ప్రపంచ నావ డోలికన్
అశాంతి దుర్నిశాంతతార్ద్ర హార్ద శాంతశ్యామలై,
సుశీల ధర్మ పాలకోక్త సూత్ర నిత్యపాలనన్
విశాల భావ విశ్వశాంతి వెల్గగా విశారదై ,
స్పృశింప లొకమీతి భీతి చింతలన్ని బాయగా
నిశా నవాంక పర్వ వేళ నిత్య మంగళా , నమో !
==========================
సరిపల్లి సూర్యనారాయణ
మెల్బోర్న్ 25-9-2014