దసరా పద్యాలు

ఏదయా మీ దయా మామీద లేదు
ఇంతసేపుంచితే ఇది మీకు తగదు
దసరాకు వస్తిమని విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
ఇరుగుపొరుగులకెల్తె ఇస్తారు సొమ్ము
పావలా ఇస్తేను పట్టీది లేదు
అర్ధరూపాయిస్తె అంటీది లేదు
ముచ్చెవక ఇస్తేను ముట్టీది లేదు
ఇచ్చరూపాయిస్తె పుచ్చుకుంటాము
అటుపైని పావలాల్ పప్పుబెల్లాలు
జై జై విజయీభవ!

శ్రీలక్ష్మికరముగా సింహగిరియందు
శ్రీహరి! కరుణించు సృష్టిరక్షకుడ !
బృందారకస్తుత! భూలోకమునను
వెలసితివి బ్రహ్మాండ భాండప్రకాశ!
వరహనరసింహావతారంబు దాల్ఛి
ఖరు హిరణ్యాక్షుని ఖండించి వైచి
బలిచక్రవర్తిచే పూజలం గొనుచు
పన్నెండు ధారలూ బాగుగా వెలసి
కొలువున్నవాడవై యీ కొండపైన
రక్షింపు మమ్మెప్డు కమలలోచనుడ!