దాక్షాయణి

శివనింద విని తనువు అర్పించావు తల్లీ!
దాక్షాయణీ! దేవీ దయ చూపవే!

హరుని విలాసములోని యర్ధంబు నీవే!
హైమవతీ! దేవీ దయ చూపవే!

శివుని ఐక్యత కొరకే తపము చేసిన తల్లీ!
నగరాజపుత్రీ! దేవీ దయ చూపవే!

ఆదిదేవుడు సుముఖుడు నీ సొంతమే తల్లీ!
సర్వమంగళ! దేవీ దయ చూపవే!

మదితలచు నీప్సితములు నీడేర్పుమో తల్లీ!
జయదుర్గ! దేవీ విజయమ్ము నీయవే!

రాంప్రకాష్ యెర్రమిల్లి